Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు : మంత్రి ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు అని.. కొరతపై వస్తున్న ఫేక్ న్యూస్ అపోహలు నమ్మెద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇందన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని కోరారు. ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని వివరించారు. డిమాండ్ కి మించి సరఫరా కొనసాగుతోందని, ఈ రోజు (బుధవారం) 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25శాతం పెరిగినా.. ఎక్కడా అంతరాయం కలగకుండా అదనంగా 22 శాతం ఇంధన వనరులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయితే కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోకపోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయని చెప్పారు. వాస్తవంగా మాత్రం ఎంత మాత్రం కొరత లేదని ఆయన పునరుద్ఘాటించారు.

అయితే, అదే సమయంలో పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంతకుమించి ప్రమాదకరమని ఉత్తమ్ హెచ్చరించారు. పెట్రోలియం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా O.G.C లైన్ ను విస్తరించినట్లు ఉత్తమ్ తెలిపారు. హైదరాబాద్ లో 596 పెట్రోల్ బంక్ లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని, రాజధానితో పాటు రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని స్పష్టం చేశారు. అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ధారవాడ, బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉందన్నారు.

ఎల్పీజీ గ్యాస్ విషయంలో కొరత లేదని, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్సెల్బీసీ ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) .. ప్రాజెక్టు పరిశీలనకు మరో ముగ్గురు ఆర్మీ ఎక్స్ పర్ట్స్ ను నియమించామని, మానిటర్ చేసేందుకు మరో అధికారిని నియమించినట్లు తెలిపారు. పరీక్షిత్ మెహ్రా కింద అధికారులు అసోసియేట్ గా పనిచేస్తున్నారని చెప్పారు. సొరంగంలో అధునాతన వెంటిలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>