కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఎకరాల్లో 60 నుండి 70 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు (Paddy Produced) చేస్తామని ప్రకటించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఈ సీజన్‌లో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రతి క్రాప్‌కు రూ. 22,000 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోందని వివరించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతానికిపైగా ఉన్న సుమారు 3 కోట్ల 20 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నామని మంత్రి ప్రకటించారు.
తాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చానని, గతంలో ఫైటర్ పైలట్‌గా సేవలు అందించిన హైదరాబాదీని అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంతో పోల్చితే తమ పాలనలో అన్ని రంగాలకు, ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్నారు. దాదాపు ఏడేళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవంతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామన్నారు. భారతదేశంలోనే హైదరాబాద్‌ను ఒక మేజర్ గ్రోత్ సిటీగా నిలబెడుతున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ముడిచమురు సమస్యలున్నా, కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా రాజకీయం చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇంధన ధరల విషయంలో చాలా ఆలస్యంగా నిద్రలేచి తప్పు చేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.
Read Also: స్టార్ట్ అయిన ‘సర్’.. ఎవరి ఓటుకు వారే కాపలా!
Follow Us On : WhatsApp

