నేను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల గురించే ఆలోచిస్తా : మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలపై వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలోని నర్మెట్ట వద్ద నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన మంత్రి తుమ్మల.. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు.

రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలని సూచించారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ (Oil Palm) పంటను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినట్లు తెలిపారు. పామాయిల్‌ దిగుమతిపై పన్ను పెంచితే.. దేశంలోని రైతులకు మేలు చేకూరుతుందని కేంద్రానికి వివరించినట్లు చెప్పారు. ఆయిల్‌ రిఫైనరీకి కూడా రేపు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రైతు గుండె చప్పుడు ఆయిల్ పామ్ అని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ పంట కోసం 45 ఏళ్లు అహర్నిశలు కృషి చేశానని.. వరి పొలంలోనూ ఆయిల్ పామ్ పంట వేసుకోవచ్చని మంత్రి తుమ్మల (Minister Tummala) తెలిపారు.

Read Also: అల్లు సినిమాస్ స్పెషల్ వీడియో.. బన్నీ ఏం చెప్పాడో విన్నారా..

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>