ప్రభుత్వ విప్‌లను ప్రకటించిన రేవంత్ సర్కార్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభ, శాసన మండలికి విప్‌లను (Assembly Whips) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభ విప్‌లుగా విజయరమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలను నియమించింది. శాసనమండలికి విప్‌లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించిన రామచంద్రు నాయక్ విప్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సైతం తొలుత విప్‌గా ఉన్నారు. కానీ ఆయన మంత్రివర్గంలోకి రావడంతో విప్‌ను వదులుకున్నారు. దీంతో తాజాగా ప్రకటించిన ముగ్గురు విప్‌లతో అసెంబ్లీలో మొత్తం విప్‌ల సంఖ్య ఐదుకు చేరుకున్నది. వీరిలో ఒకరిని చీఫ్ విప్‌గా త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్నది. జిల్లాలు, సామాజిక సమీకరణాలతో పాటు సీనియారిటీ (ఎక్కువకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగడం)ని పరిగణనలోకి తీసుకుని చీఫ్ విప్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.

Read Also: ఇరాన్ సంచలన వ్యుహం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కట్..?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>