కిలో తేడాతో గోల్డ్ మిస్: అజయ్ బాబు!

కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు మెరిశారు. పురుషుల 79 కేజీల విభాగంలో వల్లూరి అజయ్ బాబు (Valluri Ajay Babu) సిల్వర్ మెడల్ సాధించాడు. గ్లాస్గోలో అద్భుత ప్రదర్శన చేసిన భారత వెయిట్‌లిఫ్టర్లు స్వదేానికి తిరిచొచ్చారు. ఈ సందర్బంగా తాను గోల్డ్ మెడల్ మిస్ కావడంపై అజయ్ స్పందించారు. కేవలం ఒక్క కేజీ తేడాతో స్వర్ణ పతకం చేజారడం కొంత నిరాశ కలిగించిందని చెప్పాడు.

వచ్చేసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తానని అన్నాడు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ క్రీడలే తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశాడు. మరోవైపు 65 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా రజతం గెలుచుకున్నాడు. ఇది తనకు తొలి అంతర్జాతీయ పతకమని రాజా ఆనందం వ్యక్తం చేశాడు. స్వర్ణం రాలేదన్న బాధ ఉన్నా, పతకం గెలవడం సంతోషంగా ఉందన్నాడు. త్వరలోనే కోచ్‌తో కలిసి ఒలింపిక్ అర్హత రౌండ్లకు సిద్ధమవుతానని తెలిపాడు.

మహిళల 69 కేజీల విభాగంలో హర్జిందర్ కౌర్ వెండి పతకం సాధించింది. గతంలో కాంస్యం గెలిచిన ఆమె, ఈసారి ప్రదర్శన పెంచుకుని రజతం కైవసం చేసుకుంది. 58 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి కాంస్య పతకం గెలిచింది. ఈ పోటీల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొట్టారు. మీరాబాయి చాను (48 కేజీలు) స్వర్ణం సాధించగా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్ రజతాలు గెలిచారు. పురుషులలో రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, వల్లూరి అజయ్ బాబు, లవ్‌ప్రీత్ సింగ్ వెండి పతకాలు సాధించారు. బింద్యారాణి దేవి కాంస్యాన్ని అందించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>