Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లు సినిమాస్ స్పెషల్ వీడియో.. బన్నీ ఏం చెప్పాడో విన్నారా..

కలం, వెబ్ డెస్క్ : అల్లు ఫ్యామిలీ కోకాపేటలో నిర్మించిన అతిపెద్ద డాల్బీ సినిమాస్ థియేటర్ రీసెంట్ గానే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ థియేటర్ గురించి తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్పెషల్ వీడియో షేర్ చేసుకున్నారు. డాల్బీ థియేటర్ హోమ్ టూర్ అంటూ సాగిన ఈ వీడియోలో అల్లు అర్జున్ థియేటర్ విషయాలను పంచుకున్నాడు.

‘ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ థియేటర్ కు అందరికీ స్వాగతం. సినిమా అనే పేరు వింటేనే ఒక తెలియని మ్యాజిక్. అన్నింటినీ మించి దద్దరిల్లే హీరోయిజం. సినిమా అంటే మన బ్లడ్ లో కలిసిపోయిన ఒక ఎమోషన్. ఏ సినిమా తీసినా సంథింగ్ స్పెషల్ ఇవ్వాలని, లెగసీ కంటిన్యూ చేయాలన్నదే మా ఉద్దేశం. తీసే సినిమానే కాదు.. చూసే థియేటర్ అయినా అదే విధంగా ఉండాలన్నదే మా ప్యాషన్. సినిమా దగ్గరకు వచ్చేసరికి తెలిసిందే కదా.. తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) వీడియో సాగింది. ఈ వీడియోను గౌతమ్ తిన్నమూరి డైరెక్టర్ చేశారు.

Read Also: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రైన‌‌ దినేశ్ కార్తీక్‌..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>