హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ముంబై ఇండియన్స్ క్లారిటీ!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం స్పందించింది. పాండ్యా జట్టును వీడనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రస్తుతం ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఏ ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగియక ముందే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి మరో జట్టులో చేరతారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఫ్రాంచైజీలు ఆయనపై ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ప్రస్తుతం ట్రేడింగ్ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని ముంబై ఇండియన్స్ స్పష్టం చేసింది. జట్టు ప్రదర్శనపై సమగ్ర అంతర్గత సమీక్ష కొనసాగుతోందని, అది పూర్తైన తర్వాతే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై నిర్ణయాలు తీసుకుంటామని యాజమాన్యం వెల్లడించింది. రోహిత్ శర్మ స్థానంలో 2024లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తొలి సీజన్‌లో విమర్శలు ఎదుర్కొన్నారు. 2025లో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చినప్పటికీ, 2026 సీజన్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఇటీవల హార్దిక్ పాండ్యా తన టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో విడిపోవడం కూడా ఆయన భవిష్యత్తుపై ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే ప్రస్తుతం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, అన్ని అంశాలను సమీక్షించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ముంబై ఇండియన్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>