Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నికలు ముగిశాయి, బాదుడు మొదలైంది.. బీజేపీపై శ్రీధర్ బాబు ఫైర్

క‌లం మెద‌క్ బ్యూరో: ఎన్నికల తర్వాత బీజేపీ (BJP) ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, బాదుడు మొదలు పెట్టిందని మంత్రి శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) మండిపడ్డారు. ఎన్నికలకు రెండురోజుల‌ ముందు పెట్రోలియం శాఖ అధికారి చమురు ధరలు పెరగవు అని చెప్పార‌ని, కానీ ఎన్నికల ముగిసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందన్నారు. సంగారెడ్డిలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు బీజేపీ ఎందుకు తగ్గింపు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. ప్రస్తుత ధరల పెంపుతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎంతోపాటు మంత్రులు కలిసికట్టుగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధ‌ర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>