కలం వెబ్ డెస్క్ : ఇటీవలె ఓ తెలంగాణ మంత్రి(Minister), మహిళా ఐఏఎస్ అధికారి(IAS Officer)పై టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికగా వచ్చిన వార్తలపై మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) స్పందించారు. ఆ వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. ఇలాంటి వార్తలను ఎవరూ ప్రోత్సహించకూడదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సోషల్ మీడియా(Social Media) వేదికల్లో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. మీడియా మిత్రులు సత్యదూరమైన వార్తలను వ్యాప్తి చేయడం మానుకోవాలని కోరారు. ఐఏఎస్ అధికారుల పేర్లు రాయకుండా వారి గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషపూరితమైన సంప్రదాయాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.


