కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) అన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆరోపించారు. దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఫైర్ అయ్యారు.
ముందస్తు నోటీసులు లేకుండా, కేసు వివరాలు చెప్పకుండా నామినేషన్ తిరస్కరించడం ఏంటీ? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఎంత బూటకమో మరోసారి నిరూపిస్తోందని తెలిపారు. అంతేకాదు మహిళా సంక్షేమం గురించి మాట్లాడే బీజేపీ.. ఒక గాంధేయవాదిపై ఇలాంటి నిరంకుశ రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. ఇలాంటి ఘటనలపై న్యాయస్థానాలు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

