డీలిమిటేషన్‌తో సౌత్‌కు తీవ్ర అన్యాయమే: పొన్నం ప్రభాకర్

కలం, వెబ్ డెస్క్: దక్షిణ రాష్ట్రాల హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టదలచిన డీలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సరైన ప్రాధాన్యత లభించకపోవచ్చని, దీనివల్ల వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై బీజేపీకి అసలు చిత్తశుద్ధే లేదని విమర్శించారు. 1880 నుంచి ఆ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేకపోవడమే అందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>