శ‌వ రాజ‌కీయాలు వ‌ద్దు : మంత్రి పొన్నం

క‌లం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ స‌మ్మె (RTC Strike) స‌మయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్య‌వ‌హ‌రించిన తీరు మంచిది కాద‌ని.. శ‌వ‌రాజ‌కీయాలు వ‌ద్దు అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Minister Ponnam) అన్నారు. స‌మ్మె విర‌మ‌ణ నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్య‌క్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, అధికార ప్రతినిధుల‌తో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెర‌వేర్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు నిర్వ‌హించాల‌ని నేత‌లకు పొన్నం పిలుపునిచ్చారు. అలాగే, జేఏసీ నాయ‌కుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో తీసుకున్న నిర్ణ‌యాలను మంత్రి వారికి వివ‌రించారు.

ఆర్టీసీ కార్మికులతో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రుల బృందం సుమారు 15 గంటల పాటు చర్చించి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్మికుల ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వివరించారు. మిగతా ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కారిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్టీసీ సమ్మెలో 30 మందికి పైగా మరణించారని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్​ గౌడ్​ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసానిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పొన్నం (Minister Ponnam) వెల్లడించారు.

Read Also: ఆర్టీసీ సమ్మెకు పోయిందంటే అది కాంగ్రెస్ పాపమే: జగదీశ్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>