Mobile Popup Ad
Mobile Popup Ad

‘తెలంగాణ’ పేరుతో ఏర్పాటైన పార్టీలు తెలుసా!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద డిబేట్ జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి ఏర్పాటైన ఎన్నో పార్టీలు తెలంగాణను పేరులో చేర్చుకోవడం ఆనవాయితీ మాత్రమే కాదు.. వాటి మనుగడకు ఆధారంగా నిలుస్తూ వస్తోంది. అయితే, వాటిలో కాలగర్భంలో కలిసిపోయినవి ఎన్నో ఉండగా.. మరికొన్ని అచేతనంగా ఉన్నాయి. అసలు తెలంగాణ పేరు మీద ఇప్పటివరకు ఏర్పాటైన పార్టీలేంటో ఇప్పుడు పరిశీలించడం ఆసక్తికరం.

కొన్ని కీలకమైన పార్టీలు ఇవే..

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని 2001లో స్థాపించారు. 2022 అక్టోబరులో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆలె నరేంద్ర – తెలంగాణ సాధన సమితి, దేవేందర్ గౌడ్ – నవ తెలంగాణ పార్టీ, విజయశాంతి – తల్లి తెలంగాణ పార్టీ, ప్రొఫెసర్ కోదండరాం – తెలంగాణ జన సమితి, చెరుకు సుధాకర్ – తెలంగాణ ఇంటి పార్టీ, గద్దర్–తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, విమలక్క – తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, నాగం జనార్ధన్ రెడ్డి – తెలంగాణ నగారా సమితి, తెలంగాణ రక్షణ సమితి – డాక్టర్ రాజేశ్వర్ రావు, వైఎస్.షర్మిల–వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తీన్మార్ మల్లన్న–తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించారు. అయితే, వీటిలో చాలావరకు ఇప్పుడు కార్యకలాపాలు కొనసాగించడం లేదు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయాయి.

Read Also: భజ్జీతో మళ్లీ ముదిరిన గొడవ.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>