కలం, కరీంనగర్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మార్నింగ్ వాక్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. గతంలో పందిళ్ల నుండి ఎల్లమ్మ చెరువు వరకు పంట పొలాల మధ్య ఉన్న కాలువను స్వయంగా పరిశీలించారు. కాలువ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
అంతేకాకండా స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల కార్యక్రమాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

