Mobile Popup Ad
Mobile Popup Ad

పొలిటికల్ ఎంట్రీ.. రాఘవ లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన రాజకీయ ప్రయాణంపై అభిమానుల అభిప్రాయం కోరారు. తాను షేర్ చేసిన వీడియో చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో సలహాలు, మార్గదర్శకత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు.రాజకీయాల్లోకి వచ్చేందుకు తన తల్లి అనుమంతినిచ్చిందని తెలిపారు. రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తూనే, ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. లేకపోతే ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని రాఘవ లారెన్స్ వీడియోలో తెలిపారు. కాగా, తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే పార్టీ తరఫున లారెన్స్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>