హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్

కలం, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్‌గా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి వెంటనే తొలగిచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన వేళ మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తాజా ఆదేశాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తేటతెల్లం చేసిందన్నారు. అక్రమ కట్టడాల పేరుతో పేద నివాసాలను ఇష్టారాజ్యంగా కూల్చివేసిన ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని ఫైర్ అయ్యారు.

న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్‌కు ఆదేశిస్తామని హైకోర్టు హెచ్చరించినప్పటికీ, ఆ సంస్థ తీరులో మార్పు రాలేదని కవిత మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ బుద్ధి తెచ్చుకొని పెద్ద వాళ్లకు ఒక న్యాయం, పేద వాళ్లకు ఒక న్యాయం అనే విధంగా కాకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, లోతుకుంట భూముల వ్యవహారంతో పాటు కోర్టు ధిక్కరణ కేసుల్లో పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్న రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో మరో సెక్రటరీ ర్యాంక్ ఉన్న అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>