అశ్వాపురంలో ఎక్సైజ్ దాడులు.. గంజాయి సీజ్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (Ashwapuram) మండలం గొల్లగూడెంలోని సీతారామ కెనాల్ సమీపంలో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(Excise Enforcement) ఎస్‌ఐ శ్రీహరి రావు ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం సీతారామ కెనాల్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఓ మోటార్ బైక్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో 4.760 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

దీంతో అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన మోటార్ బైక్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, బైక్, సెల్‌ఫోన్ విలువ సుమారు రూ.2.96 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>