ఆహా ఏమి రుచి.. తాటి ముంజలను రుచి చూసిన మంత్రి పొన్నం

కలం, వెబ్ డెస్క్: అసలే ఎండాకాలం.. భానుడి భగభగలకు చల్లచల్లని పదార్థాలను తినాలనిపిస్తుంది. ఇక తాటిముంజలు అయితే మరి మంచిది. చాలామంది ప్రత్యేకంగా తాటిముంజలను టేస్ట్ చేస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం తాటిముంజలను ఇష్టంగా తిన్నారు. తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా సామాన్యుడిలా సందడి చేశారు. వేసవి తాపాన్ని తీర్చే ఆరోగ్యకరమైన తాటి ముంజలను స్వయంగా కోసుకుని రుచి చూశారు. ప్రకృతి సిద్ధంగా లభించే ముంజలు (Ice Apple) ఆరోగ్యానికి ఎంతో మేలని, గ్రామీణ సంపదను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మంత్రికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read Also: త్వరలో పాదయాత్ర చేస్తా.. కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>