Mobile Popup Ad
Mobile Popup Ad

మైనార్టీ మహిళలకు రంజాన్ కానుక.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

కలం, ఖమ్మం బ్యూరో: మైనార్టీ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. గురువారం ఖమ్మంలోని (Khammam) కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో మసీద్ కమిటీలకు రంజాన్ గిఫ్ట్ పాకెట్స్, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడారు. మైనార్టీ సోదరులు ప్రశాంతయుతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ఆనందంగా ప్రార్థనలు చేసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదొడికి అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు కుట్టు మిషన్లను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి పొంగులేటి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>