కలం, చంద్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) భరోసానిచ్చారు. కృష్ణారెడ్డి తల్లి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న మంత్రి, మంగళవారం చంద్రుగొండలోని కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. ఎటువంటి ఆందోళన చెందవద్దని, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

