అన్న క్యాంటీన్‌లో రూ.5 భోజనం చేసిన మంత్రి నారాయణ

కలం, వెబ్ డెస్క్: విజయవాడలోని రాణిగారితోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను మంత్రి నారాయణ (Minister Narayana) ఆకస్మిక తనిఖీ చేశారు.అన్న క్యాంటీన్ లో సదుపాయాలను పరిశీలించారు. 5 రూపాయలు చెల్లించి టోకెన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి మంత్రి నారాయణ,VMC కమిషనర్ ధ్యాన చంద్ర డిన్నర్ చేశారు. క్యాంటీన్ లో మినరల్ వాటర్, కూలర్లు, దోమ తెరలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్న క్యాంటీన్లు కొనసాగించాలని ఎంత కోరినా గత వైసీపీ ప్రభుత్వం వినిపించుకోకుండా మూసివేసిందని దుయ్యబట్టారు.పేదవాడికి నాణ్యమైన ఆహారం అందించాలనేది సీఎం చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు. వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్ లలో భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇటీవల కొత్తగా రూరల్ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించామని తెలిపారు. ప్రతిరోజూ 3.5 లక్షల మంది అన్న క్యాంటీన్ లలో ఆహారం తీసుకుంటున్నారని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>