తిరుపతిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తిరుపతి (Tirupati) పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తిరుచానూరులోని ఎంఎన్‌ఎం సర్కిల్ వద్ద భారీ గజమాలతో ఆయనను ఆహ్వానించారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లాలో నిర్వహించిన వివిధ క్రీడా కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్  పాల్గొన్నారు. గొల్లవానిగుంటలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత క్రీడలలో రాణించాలని లోకేశ్ (Nara Lokesh)  పిలుపునిచ్చారు. అలాగే క్రీడాకారులతో కలిసి స్వయంగా వాలీబాల్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>