Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల.. 99.30% ఉత్తీర్ణత నమోదు

కలం, వెబ్ డెస్క్ : ఏపీ ఎడ్‌సెట్-2026 (APEDCET-2026) ఫలితాలను అధికారికంగా విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 19,880 మంది అభ్యర్థులలో 19,741 మంది ఉత్తీర్ణులై 99.30% ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం విశేషంగా నిలిచింది. ఉత్తీర్ణులైన విద్యార్థులకు లోకేశ్ అభినందనలు తెలియజేస్తూ, ఉపాధ్యాయ వృత్తి వైపు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.

అభ్యర్థులు ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ (https://cets.apsche.ap.gov.in/EDCET) ద్వారా పొందవచ్చు. అలాగే వాట్సాప్ (9552300009) ద్వారా కూడా సమాచారం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ ఫలితాలతో రాష్ట్రంలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రవేశాలకు మార్గం మరింత సుగమమైందని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>