కలం, వెబ్ డెస్క్ : పూటకో పేరు మార్చుకునే బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుందని.. నిన్న టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ ఉన్న పార్టీ పేరు హెచ్ఆర్ఎస్ (హరీశ్ రావు రాష్ట్ర సమితి) గా పేరు మార్చుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఎద్దేవా చేశారు. నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభలో కొమటి రెడ్డి మాట్లాడారు.
కేటీఆర్ కు, హరీశ్ రావుకు పని లేకపోవడం వల్లే హ్యామ్ రోడ్ల టెండర్లలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టెండర్లు ఇంకా ప్రారంభం కాకముందే విమర్శలు చేయడం తగదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతికుటుంబానికి రేషన్ కార్డులు జారీ చేసి.. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

