Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల ప్రయోజనాలే ముఖ్యం.. అమెరికాతో ట్రేడ్ డీల్ పై కేంద్రం క్లారిటీ

కలం, డెస్క్ : ఇండియాపై సుంకాలను 25 శాతంనుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్టు నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాతో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు అంగీకరించిందని.. అమెరికా ఉత్పత్తుల మీద సుంకాలను జీరోకు తగ్గించేందుకు కూడీ భారత్ ముందుకు సాగుతోందన్నారు ట్రంప్. ఈ ప్రకటనపై తాజాగా కేంద్రం స్పందించింది. అమెరికాతో (US – India) ట్రేడ్ డీల్ విషయంలో భారత రైతుల ప్రయోజనాలే ముఖ్యం అంటూ తెలిపింది కేంద్రం.

ఇండియా (US – India) రైతులకు అన్యాయం జరిగే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. అలాగే వెనెజుల నుంచి చమురు కొనే అంశం కూడా ప్రస్తుతానికి పరిశీలనలోనే ఉందని కేంద్రం వివరించింది. అమెరికా మన దేశానికి ఎగుమతి చేసే పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు ముందు నుంచి కేంద్రం సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికా రైతులకు అక్కడి ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందువల్లే ప్రపంచ మార్కెట్ లో అమెరికా రైతుల ఉత్పత్తులు తక్కువకే లభిస్తుంటాయి. ఇప్పుడు ఇండియాలో సుంకాలు తగ్గిస్తే.. మన రైతులు పండించే పంటల కంటే.. అమెరికా రైతుల ఉత్పత్తులే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దాని వల్ల మన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందనేది కేంద్రం ఆలోచన.

Read Also: ట్రేడ్​ డీల్​తో రైతుల కష్టం అమెరికాకు తాకట్టు : రాహుల్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>