ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy) వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ పవన్ చేసిన కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది తెలంగాణవాదులు పవన్ ను విమర్శించారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇప్పుడు కొత్త రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి ఆయన వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదు. కచ్చితంగా పవన్ భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే ఆయన సినిమాలు ఒక్కటి కూడా తెలంగాణలో ఆడదు అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి.
అలాగే నీటి వాటాలపై కూడా సీరియస్ గా స్పందించారు. ‘పోతిరెడ్డి పాడుతో మా తెలంగాణ నీటిని దోచుకున్నారు. ఆనాడు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పటికీ మా తెలంగాణలో చాలా జిల్లాలకు నీళ్లు రావట్లేదు. డెవలప్ మెంట్ జరగట్లేదు. వీటిపై మా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది’ అన్నారు మంత్రి. దీంతో పవన్ కల్యాణ్ మరింత చిక్కుల్లో పడ్డట్టు అయింది. ఎందుకంటే కోమటిరెడ్డి ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మినిస్టర్. త్వరలోనే పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు రెడీగా ఉంది. తెలంగాణలో పొలిటికల్ లీడర్స్ అంతా పవన్(Minister Komatireddy) కామెంట్స్ ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మరి పవన్ క్షమాపణ చెబుతాడా లేదా అనేది చూడాలి.
Read Also: సర్పంచ్ బరిలో అనుచరులు.. పల్లెల్లో ఎమ్మెల్యేలు..!
Follow Us On: X(Twitter)


