ధర్మపురి క్షేత్రాభివృద్ధికి చారిత్రాత్మక శ్రీకారం: అజాహారుద్దీన్

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అజాహారుద్దీన్ (Minister Azharuddin) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి జిల్లా ప్రగతి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారదర్శకత, జవాబుదారీతనం, సమగ్ర అభివ`ద్ది, సామాజిక న్యాయం అనే నాలుగు ప్రధాన స్థంభాలపై ప్రజా ప్రభుత్వం తన పాలనను కొనసాగిస్తుందన్నారు.

గ్రామీణ తెలంగాణను బలోపేతం చేస్తూనే పట్టణ ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేయడం ద్వారా సమతుల్య ప్రగతిని సాధించాలన్నది ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. పురాతన దేవాలయాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం చారిత్రాత్మక శ్రీకారం చుట్టిందని తెలిపారు. 2027 లో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల భారీ నిధులను మంజూరు చేసిందన్నారు.

ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత రూపురేఖలు మార్చుకోనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజ గౌడ్, డీఆర్వో కేవై ప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>