కలం, వెబ్డెస్క్: నేటి యువత చర్మ సౌందర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కోసం మార్కెట్లో లభించే రకరకాల రసాయన క్రీముల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎటువంటి ఖర్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం మన ఇంట్లో ఉండే పాలమీగడ (Milk Cream) ద్వారానే చర్మాన్ని సహజంగా, ప్రకాశవంతంగా మెరిపించవచ్చని (Beauty Tips) చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
పాలమీగడతో కలిగే ప్రయోజనాలు
సహజ మాయిశ్చరైజర్: పాలమీగడ చర్మానికి సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. పాలమీగడలోని కొవ్వు పదార్థాలు పొడి చర్మాన్ని నివారించి, చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి.
పాలమీగడతో మెరిసే చర్మం: పాలమీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగించి, ముఖానికి సహజమైన కాంతిని ఇస్తుంది.
నల్లటి మచ్చల నివారణ: ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు పోగోట్టడంలో పాలమీగడ అద్భుతంగా పనిచేస్తుంది. ఎండ తీవ్రత వల్ల వచ్చే నలుపు (ట్యాన్)ను తగ్గించడంలో సహాయపడుతుంది.
వృద్ధాప్య ఛాయల నియంత్రణ: చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో పాలమీగడ చాలా బాగా సహాయపడుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
ఉపయోగించే విధానాలు
మీగడ – శనగపిండి ప్యాక్: ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ పాల మీగడను రెండు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. వీటితో పాటు చిటికెడు పసుపు కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత మంచి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే అందం పెరుగుతుందని చెబుతున్నారు.
మీగడ – నిమ్మరసం ప్యాక్: నల్లటి మచ్చలు, ట్యాన్ తగ్గడానికి మీగడలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయి.
సహజ మసాజ్: కేవలం కొద్దిగా పాలమీగడను తీసుకుని ముఖంపై వృత్తాకారంలో (Circular motion) మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.

