నిజామాబాద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో ఐక్యత సందేశం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను (Milad-un-Nabi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ అలీ షబ్బీర్, మహేష్ కుమార్ గౌడ్.. మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

సభలో మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని సూచించారు. తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రేమ, శాంతి, సోదరభావంతో సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, జావిద్ అక్రమ్, కుద్దూస్, హారున్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందాన్, అన్వార్, మొహమ్మద్ అహ్మద్, కో ఆప్షన్ సభ్యుడు మహేందర్ సింగ్, ఆసిఫ్, వహీద్, మిలాద్ కమిటీ అధ్యక్షులు షాయిబ్ రజా, మహమ్మద్ అబ్బు రజా, రషీద్ రాజా, ముజహిద్ ఖాన్, పాప ఖాన్, జావీద్ ఖాన్, కయ్యుమ్, షబ్బీర్ రాజ్జాక్, జఫర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొయిన్, సమీ, రియాజుద్దీన్, సఫ్దర్, అఫ్రోజ్ ఖాన్, సాదిక్ సోహైల్, షైక్ మహబూబ్, పర్వేజ్, ఈసా తదితరులు పాల్గొన్నారు. మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Also Read : నీటి విడుదలపై వివాదం.. కృష్ణా జలాల్లో మళ్లీ మంటలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>