Mobile Popup Ad
Mobile Popup Ad

వలస మహిళా కూలి ఆత్మహత్య

కలం, కరీంనగర్ బ్యూరో : ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ (karimnagar) రూరల్ మండలం లోని చర్లబూత్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు బ్రతుకుతెరువు కొసం గత మూడు నెలల క్రితం కరీంనగర్ రూరల్ మండలంలోని చర్లబూత్కూర్ గ్రామంలో ఉన్న ఇటుక బట్టీ లోకి పనికి వచ్చారు. కూలి పని చేస్తుండగా మహిళ గత కొన్ని రోజుల నుండి మానసిక పరిస్థితి సరిగ్గా లేక అనారోగ్యంతో బాధపడుతూ పనికి వెళ్లకుండా బట్టీల వద్ద ఉన్న తన పాపతో రూమ్ లోనే ఉంటుంది.

శుక్రవారం ఉదయం తన భర్త బట్టీల వద్దకు పనికి వెళ్లగా మహిళ( 23) తన 9 నెలల పాపతో ఇంటి వద్ద ఉండి గదిలో ఇనుప పైపుకు చీరతో ఉరివేసుకుంది. అయితే ఆమె వేలాడుతుండగా చూసిన కొందరు స్థానికులు వెంటనే ఉరివేసుకున్న చీరను విడిపించారు. భర్తకు తెలిపి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిక్షించి ఆమె అప్పటికే మరణించిందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఒరిస్సా లో ఉన్న మహిళ తల్లిదండ్రులకు సమాచారం అందించగా శనివారం తండ్రి తహసిల్ కేటాకీ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన బిడ్డ గత కొద్ది రోజుల నుండి మానసిక పరిస్థితి సరిగా లేదని తన అల్లుడు ఫోన్ ద్వారా తెలిపారని, శవపరీక్ష జరిపించి మృతదేహాన్ని అప్పగించాలని కోరారు . అయితే శవపంచనామా జరిపి ప్రస్తుతం బాడీని శవపరీక్షకు పంపించినట్లు సిఐ నిరంజన్ రెడ్డి సదరు వ్యక్తికి తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>