Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

కలం, నల్గొండ బ్యూరో: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) విజయపురి నార్త్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. విజయపురి నార్త్ ఎస్‌ఐ ముత్తయ్య‌ తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల గౌరారానికి చెందిన దండుగుల శ్రీను(41) తన కొడుకు మహేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నాగార్జునసాగర్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ టౌన్ శివం హోటల్ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో దండగుల శ్రీను అక్కడికక్కడే మరణించగా, కొడుకు మహేష్‌కు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>