Mobile Popup Ad
Mobile Popup Ad

ధోనీ వర్సెస్ రోహిత్.. వాంఖడేలో అసలైన సమరం!

కలం, స్పోర్ట్స్​ : ఐపీఎల్ 2026లో అత్యంత ఆసక్తికరమైన సమరానికి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) జట్లు గురువారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ స్పెషాలిటీ కేవలం జట్లు కాదు.. ఈ మ్యాచ్ కోసం ఆ ప్లేయింగ్ స్క్వాడ్‌లోకి వస్తున్న ప్లేయర్లు. చెన్నై తరుపు ధోనీ (Dhoni), ముంబై తరుపున రోహిత్ (Rohit) బరిలోకి దిగనున్నారు. దీంతో ఈ మ్యాచ్‌కు హైప్ భారీగా పెరిగిపోయింది. ఇద్దరు స్టార్స్ మధ్య పోరు ఎలా ఉంటుందా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోనీ, ఈ కీలక మ్యాచ్‌తో మళ్ళీ మైదానంలోకి రానుండటం అభిమానుల్లో జోష్ నింపుతోంది.

ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ధోనీ దగ్గరకు వెళ్లిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌ను చూసి ధోనీ సరదాగా ఆటపట్టించారు. చాహర్ వెనుక ఉన్న కెమెరామన్‌ను చూసిన ధోనీ.. కెమెరా ఉంటే తాము ప్రశాంతంగా మాట్లాడుకోలేమని, వెంటనే అతడిని పంపించమని నవ్వుతూ చెప్పారు. దీంతో చాహర్ కూడా స్పందిస్తూ అక్కడి నుంచి వెళ్లాలని కెమెరామన్‌ను కోరారు.

దీపక్ చాహర్ 2018 నుంచి 2024 వరకు ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన 76 మ్యాచ్‌ల్లో 75 వికెట్లు తీసి, చెన్నై మూడుసార్లు టైటిల్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించారు. 2025 మెగా వేలానికి ముందు ఆయన జట్టు నుంచి విడుదలయ్యారు. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్యే కాదు, ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల మధ్య పోరుగా మారనుంది. ఇద్దరు ఆటగాళ్లు తమ జట్టు అవసరాల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. టోర్నీలో నిలవాలంటే ఇరు జట్లకు ఈ విజయం చాలా కీలకం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>