ప్రభుత్వ సలహాదారును కలిసిన బాధిత రైతులు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు పంటలు నష్టపోయిన బాధిత రైతులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Government Advisor) షబ్బీర్ అలీ(Shabbir Ali) ని గురువారం కలిశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తాము పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున తమను ఆదుకోవాలని షబ్బీర్ అలీని వారు కోరారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తో షబ్బీర్ అలీ ఫోన్‌లో మాట్లాడారు. బాధిత రైతులను ఆదుకోవాలని మంత్రి తుమ్మలను కోరినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, క్యాబినెట్ మీటింగ్‌లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అలీ తెలిపారు. బాధిత రైతులతో పాటు షబ్బీర్ అలీని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, సుదర్శన్, మోహన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, లింబాద్రి, రాంచంద్రం తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>