మెగా158 కోసం చిరంజీవి కొత్త అవతార్ లాక్

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby) డైరక్షన్‌లో మరో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతుంది. ‘మెగా 158’ (Mega158) వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా (Mega158) భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య అద్భుత విజయం సాధించింది. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మాఫియా నేపధ్యంలో సాగే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి లుక్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం మెగాస్టార్ లుక్ లాక్ చేసినట్లు దర్శకుడు బాబీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండు వేర్వేరు లుక్స్‌తో మెగాస్టార్ కొత్త అవతార్‌లో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్‌కి  సంబంధించి అధికారిక అప్డేట్స్ రానున్నాయి.

Read Also: వాట్సాప్ సంచలన నిర్ణయం.. 9400 ఎకౌంట్స్ బ్యాన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>