కలం, వెబ్ డెస్క్ : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల ఓ బాలిక చేసిన వింత ప్రవర్తనకు అక్కడున్న వారు భయంతో వణికిపోయారు. నిశ్శబ్ధంగా ఉన్న ఆసుపత్రిలో బాలిక బిగ్గరగా, అసాధారణంగా కేకలు వేసింది. అంతేకాదు దెయ్యం సినిమా తరహాలో గోడలు ఎక్కేందుకు యత్నించింది. రాజస్థాన్ (Rajasthan)లోని రావత్‌భట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో వెంటనే రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కాగా, ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హర్రర్ సీన్ ను తలపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే బాలిక వింత ప్రవర్తనపై ఇంకా సరైన కారణాలు తెలియరాలేదు. ఆసుపత్రి వర్గాలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. సదరు బాలిక వింత ప్రవర్తన పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చేతబడి శక్తుల వల్ల ఆ మహిళ ఇలా ప్రవర్తించిందని కొందరు ఆరోపిస్తుంటే.. మానసిక ఆరోగ్య సమస్య వల్లే ఇలాంటివి చేస్తుంటారని మరికొందరు అంటున్నారు.

