అలర్ట్.. రేపే టెన్త్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. రేపు పదో తరగతి పరీక్షా ఫలితాలు (TG 10th Results) వెల్లడికానున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. నాంపల్లిలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేస్తారు.

కాగా, ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన టెస్త్ పరీక్షలకు మొత్తం 5 లక్షల 28 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రేపు రిలీజ్ చేయనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Read Also:  ఆమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>