మహబూబ్ నగర్‌లో రూ.15 లక్షలతో నిరీక్షణ షెడ్.. ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలోని కల్వరి కొండ స్మశాన వాటికలో ముడా నిధులు రూ.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన నిరీక్షణ షెడ్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మశాన వాటికకు వచ్చే ప్రజలకు, అంత్యక్రియల సమయంలో వేచి ఉండే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ షెడ్‌ను నిర్మించినట్లు తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతిమ సంస్కారాలు ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినవని, ఏ మతంలోనైనా అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తామని పేర్కొన్నారు. స్మశాన వాటికలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడం ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కార్పొరేటర్ గిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజ్మత్ అలీ, నాయకులు రాములు యాదవ్, మైత్రి యాదయ్య, కాంగ్రెస్ క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షుడు దాసరి సామ్యల్, చిన్న రాజు, చంద్రమౌళి, రవి రాము, ఎంబీసీ చర్చి ఫాస్టర్ వరప్రసాద్, కార్యదర్శి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : హైదరాబాద్‌లో భారీ శబ్దాలు.. భయంతో రోడ్లపైకి జనాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>