సుర్జాపూర్ వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు

కలం, ఖానాపూర్: ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో (Surjapur Venkateswara Swamy Temple) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.

ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>