వారి జోలికి వస్తే సహించేది లేదు.. జగన్ మాస్ వార్నింగ్!

కలం, వెబ్ డెస్క్ : స్థానిక ఎన్నికల (Local Body Elections) వేళ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న రాజకీయ దాడులపై స్పందిస్తూ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ (YS Jagan) కూటమి సర్కార్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ శ్రేణుల జోలికి వస్తే సహించేది లేదని, వారిపై చేయి వేస్తే నేరుగా తనపైనే చెయ్యేసినట్లుగా భావిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రాజ్యాంగానికి కట్టుబడి విధులు నిర్వహించాలి తప్ప సీఎం చంద్రబాబు కోసం కాదని హితవు పలికారు. తమ సమయం వచ్చినప్పుడు ప్రతి అన్యాయానికి వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ నుంచి పాదయాత్ర షురూ

ప్రజాసమస్యల పోరాటంలో భాగంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపడతానని ఈ సందర్భంగా వైఎస్ జగన్ (YS Jagan) సంచలన ప్రకటన చేశారు. హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధైర్యంగా తిరగబడాలని, ప్రతి కార్యకర్తకు, ప్రజలకు ఒక అన్నలా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అరాచక పాలనపై పోరాడేందుకు ఇప్పటికే ‘స్లీవ్స్ మడతపెట్టామని’, ఎంతమంది వచ్చినా గట్టిగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. స్థానిక పోలింగ్ రోజున స్వయంగా తానే బూత్‌కు వెళ్లి ఓటు వేస్తానని, పార్టీ శ్రేణులు కూడా ఏమాత్రం వెరవకుండా ప్రజాస్వామ్య పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Also Read : తుఫాన్ హెచ్చరికల వేళ.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>