కలం, వెబ్ డెస్క్ : గోట్ (GOAT) భారత పర్యటనలో భాగంగా ఫుట్ బాల్ దిగ్గజం లియెనల్ మెస్సీ (Messi) గుజరాత్ జామ్ నగర్ లో ఉన్న వంతారా(Vantara) వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ ను సందర్శించనున్నారు. సోమవారం రాత్రి అక్కడే బస చేస్తారని సమాచారం. ఢిల్లీలో సినీతారలు, ప్రముఖులతో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ తరువాత మెస్సీ వంతారాకు చేరుకుంటారు.
మెస్సీకి టీ20 వరల్డ్ కప్ టికెట్ ఇచ్చిన జై షా
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో లియోనల్ మెస్సీ(Messi) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ జై షా మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్, యూఎస్ఏ మ్యాచ్ టికెట్ అందజేశారు. అలాగే, భారత క్రికెట్ జెర్సీతో పాటు క్రికెట్ బ్యాట్ ను ప్రెజెంట్ చేశారు.
Read Also: స్క్వాష్ ఛాంపియన్స్‌కు రేవంత్ అభినందనలు
Follow Us On: Youtube


