‘పెద్ది’ టీంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ “పెద్ది”(Peddi).. జూన్ 4న విడుదలయి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా టీంకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలిపారు. సినిమా విడుదలైనప్పటి నుంచి పొల్లాచిలో షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, హైదరాబాద్‌కు తిరిగి రాగానే చిత్రబృందాన్ని వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

‘పెద్ది’ టీం చేసిన కృషిని ప్రశంసించిన చిరంజీవి, సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కథ, నటన, సాంకేతిక విలువలు ఎంతో బాగున్నాయని కొనియాడారు. ఈ భేటీ సందర్భంగా టీం సభ్యులతో చిరు ఆత్మీయంగా ముచ్చటించారు. మెగాస్టార్ అభినందనలు అందుకోవడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే ప్రేక్షకులలో మంచి స్పందన పొందుతున్న ‘పెద్ది’ సినిమాకు మెగాస్టార్ అభినందనలు రావడం మరింత హైప్‌ను తెచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>