ఎంపీ అరవింద్‌తో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడి భేటీ

కలం, జగిత్యాల: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్‌ను (MP Dharmapuri Arvind) బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ (Narapaka Ashok) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, దళిత సామాజిక వర్గ ప్రజలను పార్టీకి చేరువ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురూ చర్చించారు.

ప్రత్యేకంగా బీర్‌పూర్ మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తరించడం, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం, మండల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం వంటి అంశాలను ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టికి నారపాక అశోక్ తీసుకెళ్లారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామని, పార్టీ అభివృద్ధి, బలోపేతానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా ఇచ్చినట్లు నారపాక అశోక్ తెలిపారు.

రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో ఎస్సీ మోర్చాను మరింత పటిష్టం చేయడంతో పాటు, దళిత వర్గాల సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని నారపాక అశోక్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>