కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చందూర్ మండలం కారేగాం తండా (Karegam Thanda) గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెడికవర్ – లక్షణ కంటి ఆసుపత్రి సహకారంతో మెగా హెల్త్ క్యాంపు (Mega Health Camp) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, డాక్టర్ అజయ్ కుమార్, వయీస్ అలీ, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సోని పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.
శిబిరంలో గుండె సంబంధిత పరీక్షలు, షుగర్ పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య సలహాలు, చికిత్స సూచనలు అందించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం (Mega Health Camp) లో ఉప సర్పంచ్ తారా చంద్, కార్యదర్శి దుర్గా ప్రసాద్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: చిన్నారుల కోసం రంగంలోకి వాయుసేన.. అసలేమైందంటే?
Follow Us On: WhatsApp

