కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) పై
ఇండియా కూటమి నిరసనలు తీవ్రతరం చేసింది. సీఈసీ తొలగింపే లక్ష్యంగా చేస్తున్న పోరాటంలో భాగంగా కాంగ్రెస్ శనివారం ఢిల్లీలో మాక్ పార్లమెంట్ (Congress Mock Parliament) ఏర్పాటు చేసింది. మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతియ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓటర్ల పేర్ల తొలగింపు, ఈసీ పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సీఈసీపై ప్రజా అభిశంసన ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ఈ మాక్ పార్లమెంట్ (Congress Mock Parliament) ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఇండియా కూటమిలో ఉన్న 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి.
Also Read : ఎయిర్ఫోర్స్ చీఫ్గా అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు
Follow Us On : WhatsApp

