కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న కొత్త చిత్రం ‘మెగా 158′(Mega 158) ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సినిమాకు పవన్ కల్యాణ్ తొలి క్లాప్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీలోని ఈ ప్రత్యేక ఘట్టం అభిమానులలో భారీ ఉత్సాహాన్ని నింపింది. మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించడంతో వేడుక మరింత సందడిగా మారింది. ఇదిలా ఉంటే ఈ ఓపెనింగ్ వేడుకలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీని ప్రతిబింబించే ప్రత్యేక శాలువా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ శాలువాపై చిరంజీవి, పవన్ కల్యాణ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆకారాలను అందంగా అల్లిక రూపంలో రూపొందించారు. ఈ ప్రత్యేక డిజైన్‌ను చూసిన అభిమానులు, అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శాలువాతో టీమ్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబును సత్కరించడం వేడుకలో హైలైట్‌గా నిలిచింది. మెగా బ్రదర్స్‌పై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని ఈ వినూత్న ఆలోచన ద్వారా వ్యక్తం చేసినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

