కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా (MeeSeva) కేంద్రాలు 36 గంటలపాటు తాత్కాలికంగా మూతపడనున్నాయి. మీసేవ పోర్టల్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ చేయడం, సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రోజంతా వెబ్‌సైట్ అందుబాటులో ఉండదు. తిరిగి ఆదివారం (Sunday) ఉదయం 8 గంటల తర్వాత సాఫ్ట్‌వేర్ ప్రక్రియ పూర్తవుతుంది. మీసేవ సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

