కలం, కరీంనగర్: మేదరి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున కరీంనగర్ (Karimnagar)లోని సంఘ భవనంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు పూలను పూజిస్తూ ప్రత్యేకంగా జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి వైభవానికి బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మేదరి మహిళా సంఘం నగర అధ్యక్షురాలు వాణిశ్రీ, ప్రధాన కార్యదర్శి పిట్టల స్వప్నతో పాటు లక్ష్మీ, భాగ్య, జ్యోతి, సుజాత, పలువురు మహిళలు పాల్గొన్నారు.

