మత్స్యకారులు సేఫ్.. కుటుంబాల్లో ఆనందం!

కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర ఉత్కంఠ కలిగించిన ఏడుగురు మత్స్యకారుల గల్లంతు (Missing Fishermen) ఘటన చివరికి సుఖాంతమైంది. అర్ధరాత్రి దాటాక వారంతా ఉప్పాడ తీరానికి బోటులో సురక్షితంగా చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాకినాడ జిల్లా సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్య్సకారులు ఈ నెల 8న కాకినాడ హార్బర్ నుంచి చేపల వేటుకు బయల్దేరారు. 19 వరకు వారంతా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. 19 నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు కూడా స్పందించి.. వెంటనే వారి జాడ కోసం గాలింపు చేపట్టాలని ఆదేశించారు.

డీపీ సీ వేటతోనే సిగ్నల్స్ కట్..

గల్లంతయిన మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఎంత గాలించినా ఆచూకీ కనిపెట్టలేకపోయారు. చెన్నై అధికారులకు కూడా సమాచారం అందించినా.. తమకు తెలియవనే సమాధానం వచ్చింది. ఆక్వాన్ తుఫాన్‌లో చిక్కుకున్నారనే అనుమానం కూడా కలిగింది. సిగ్నల్స్ చివరి సారి కట్ అయిన ప్రాంతం వైపు వెతికినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో వారే తమ బోటులో సురక్షితంగా రావడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చేపల వేట కోసం డీప్ సీలోకి వెళ్లడం వలనే సిగ్నల్స్ కట్ అయ్యాయని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>