చేపల మార్కెట్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న చేపల మార్కెట్లపై టీజీ సేఫ్‌ (TG SAFE)కి చెందిన ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు దాడులు చేపట్టారు. బేగంబజార్, రామ్ నగర్ మార్కెట్లలో ఉదయం నుంచే తనిఖీలు ప్రారంభించిన అధికారులు.. చేపల నాణ్యత, వాటిని నిల్వ చేస్తున్న విధానాలను పరిశీలించారు. చేపలు ఏయే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారనే విషయాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన ఇంపోర్ట్స్ బిల్స్, ఆర్డర్ల రికార్డులను సరిచూశారు. చేపల నాణ్యతతో పాటు మార్కెట్లలో ఏమాత్రం పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఫిర్యాదులు రావడంతో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరానికి ప్రధానంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల నుంచే ఎక్కవగా చేపలను దిగుమతి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>