కలం, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమ్మకానికి పెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ చోరీకి గురైంది. కొనుగోలుదారుడి ముసుగులో వచ్చిన ఓ దుండగుడు టెస్ట్ రైడ్ నెపంతో బైక్ తీసుకెళ్లి పరారయ్యాడు.
వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన ఓ యువకుడు తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్ లో ప్రకటన పెట్టాడు. ఈ ప్రకటన చూసి బైక్ కొనుగోలు చేస్తానంటూ నిందితుడు బాధితుడిని సంప్రదించాడు. అనంతరం బైక్ను పరిశీలించి, టెస్ట్ రైడ్ చేస్తానని చెప్పి దానిపై ఎక్కి వెళ్లాడు. ఎంతసేపటికీ నిందితుడు తిరిగి రాకపోవడంతో బాధితుడు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

